ఆర్ఆర్ఆర్ కంటే ముందే అలియా భట్

ఆర్ఆర్ఆర్ లో సీత పాత్రలో అలియా భట్ ఎలా ఉందో చూడాలనే ఆత్రుత అందర్లో ఉంది. అంతా దీని
కోసమే వెయిటింగ్. అయితే ఈ సినిమా కంటే ముందే అలియా నుంచి మరో సినిమా రాబోతోంది. అదే
గంగూబాయి కతియావాడీ. ఈ బాలీవుడ్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది.

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “గంగూబాయి కతియావాడి”. బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్‌ జైదీ రచించిన “మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై” అనే బుక్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంజయ్‌ లీలా భన్సాలీ, డా. జ‌యంతిలాల్‌గ‌డ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ‌బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.

ఈ చిత్రంలో గంగూబాయిగా అలియా భట్‌ వేశ్య గృహం నడిపే యజమానిగా నటిస్తోంది. ఇప్పటికే పాత్రకు
సంబంధించిన పోస్టర్‌, టీజ‌ర్ విడుద‌లై విశేష స్పంద‌న రాబ‌ట్టుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 6,
2022న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.

మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.
అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి 7న ఆ సినిమా వస్తుంది. అదే కనుక జరిగితే 24 గంటల గ్యాప్ లో అలియా నుంచి 2 సినిమాలన్నమాట.