మహాసముద్రంలో పాటల హంగామా

శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న‌ ‘మహాసముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి
అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు
అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి అతి పెద్ద అసెట్‌. ట్రైలర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, ఇప్ప‌టికే రిలీజైన సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మ‌హా స‌ముద్రం థర్డ్ సింగిల్ `హే తికమక` లిరికల్ వీడియోను విడుదల చేశారు మేక‌ర్స్‌.

ఈ పాటలో రెండు జంటల ప్రేమ కథలు కనిపిస్తున్నాయి. శర్వానంద్ అను ఇమాన్యుయేల్, సిద్దార్థ్ అదితీ
రావు హైదరీ జంట పక్షుల్లా ఈ పాటలో కనిపిస్తున్నారు. ఈ పాట ఎంత అద్భుతంగా ఉందో.. ఆ జోడి మధ్య
కెమిస్ట్రీ కూడా అంతే అద్భుతంగా ఉంది. హరి చరణ్, నూతన్ మోహన్ ఈ పాటను ఆలపించారు. కిట్టు
వరప్రసాద్ సాహిత్యాన్ని అందించారు.

ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే మ‌హా స‌ముద్రం ట్రైలర్ సోష‌ల్ మీడియాలో దూసుకుపోతుంది.