కొండపొలం సెన్సార్ టాక్

ఉప్పెన వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న రెండవ చిత్రం `కొండపొలం`. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ చిత్రం అక్టోబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జ‌రుగుతున్నాయి. తాజాగా కొండ‌పొలం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ మూవీకి సెన్సారు వారు ఎలాంటి క‌ట్స్ చెప్ప‌కుండా క్లీన్ యూ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌డంతో పాటు సినిమా చూసి మేకర్స్ ను ప్రశంసించారు. 2 గంటల 15 నిమిషాల ప‌ర్‌ఫెక్ట్ ర‌న్‌టైమ్‌తో ప్రేక్ష‌కుల‌ముందుకు రాబోతుంది ఈ సినిమా.

ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ , ‘ఓబులమ్మ’, ‘శ్వాసలో’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది.

సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండ పొలం’ నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు.