రవితేజ నుంచి మరో సినిమా

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. బ్లాక్ బస్టర్ క్రాక్ తో ఫామ్ లోకి వచ్చేశాడు. ప్రస్తుతం రవితేజ వరుస ప్రాజెక్ట్‌ లను ఓకే చేస్తున్నారు. అందులో భాగంగా మరో కొత్త సినిమా అప్డేట్ ఇచ్చేశారు. రవితేజ కెరీర్‌లో 69వ సినిమాగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌కు త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన సినిమాల్లో ఎంతటి వినోదం ఉంటుందో అందరికీ తెలిసిందే.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ మూవీ టైటిల్‌ ఇంకా ఫిక్స్ కాలేదు. RT69గా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత, వివేక్ కూచిబొట్ల సహ నిర్మాత.

ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నాడు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. అక్టోబర్ 4 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ, పెళ్లిసందD అనే సినిమాలో నటిస్తోంది.