కొండపొలంలో ఆ పాత్ర లేదంటున్న క్రిష్

నవల ఆధారంగా తెరకెక్కింది కొండపొలం సినిమా. అయితే ఆ నవలను యాజ్ ఇటీజ్ గా తెరకెక్కించలేదు దర్శకుడు క్రిష్. సినిమాకు తగ్గట్టు అందులో కొన్ని మార్పుచేర్పులు చేశాడు. మరీ ముఖ్యంగా హీరోయిన్ పాత్రను చొప్పించాడు.

అవును.. కొండపొలం నవలలో హీరోయిన్ ఉండదు. కానీ కమర్షియాలిటీ కోసం సినిమాలో హీరోయిన్ పాత్రను క్రియేట్ చేశాడు దర్శకుడు. దీని కోసం రకుల్ ను తీసుకున్నాడు. వైష్ణవ్-రకుల్ మధ్య ప్రేమ సన్నివేశాలు బాగా వచ్చాయంటున్నాడు ఈ దర్శకుడు.. అసలు రకుల్ ను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించాడు.

“జ్ఞాన శేఖర్ సూచనతోనే రకుల్‌ను ఈ సినిమాకు తీసుకున్నాం. కెమెరామెన్ చెబితే ఎప్పుడూ తప్పుకాదు.
అలా ఈ కథను రకుల్‌కు చెప్పేందుకు వెళ్లాను. కథ చెబుతుంటూనే ఆమె మొహంలోని హావాభావాలను చూసి ఓబులమ్మ పాత్రకు సరిపోతుందని అనుకున్నాను. ఇక ఈ పాత్ర కోసం మరింత స్లిమ్‌గా మారింది.”

ఇలా రకుల్ ఎంపిక వెనక కథను బయటపెట్టాడు క్రిష్. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది
కొండపొలం. వైష్ణవ్ తేజ్ కు ఇది రెండో సినిమా.