గని ఫస్ట్ పంచ్ వచ్చేసింది

వ‌రుణ్‌తేజ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం `గ‌ని`. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్లపై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈరోజు ‘గ‌ని’ ఫ‌స్ట్ పంచ్ అంటూ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

గ్లింప్స్‌ను గ‌మ‌నిస్తే.. బాక్సింగ్ రింగ్‌లో వ‌రుణ్ తేజ్‌ను బ్యాక్ నుంచి చూపించారు. అత‌ను బాక్సింగ్ ఆట‌గాళ్లు ధ‌రించే జెర్సీని ధ‌రించి ఉన్నాడు. దానిపై ‘గ‌ని’ అనే పేరు క‌న‌ప‌డుతుంది. వ‌రుణ్‌తేజ్ ఫేస్‌ను రివీల్ చేయ‌గానే అత‌ను ఫంచ్ విసురుతాడు. గ‌ని..క‌నివిని ఎరుగ‌ని అనే లైన్ బ్యాగ్రౌండ్‌ స్కోర్ గా వినిపిస్తుంది.

ఇది వ‌ర‌కు చిత్రాల‌కు భిన్నంగా వ‌రుణ్‌తేజ్ ఈ మూవీలో స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ మూవీ కోసం
కష్టపడి బాక్సింగ్ నేర్చుకున్నాడు. బాడీ కూడా బిల్డప్ చేశాడు. విదేశాల‌కు వెళ్లి బాక్సింగ్ ట్రైనింగ్
తీసుకున్నారు. తన లుక్ విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త వ‌హించారు.

హాలీవుడ్ చిత్రం టైటాన్స్‌, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన
హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్.. గని సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్
చేయ‌డం విశేషం. డిసెంబ‌ర్ 3న ప్ర‌పంచవ్యాప్తంగా ‘గ‌ని’ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ గ్లింప్స్ ద్వారా అనౌన్స్ చేశారు.