ఆది నుంచి మరో కొత్త సినిమా ప్రకటన

ఆది సాయికుమార్ ఇప్పటికే 3 సినిమాలు చేస్తున్నాడు. వాటిలో 2 సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.
ఇప్పుడు వీటికి అదనంగా మరో సినిమాను ప్రకటించాడు ఈ హీరో. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా లకు
డిమాండ్ పెరుగుతున్న ట్రెండ్ లో ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ తో ఆది సాయికుమార్ హీరో గా కొత్త సినిమా
రాబోతోంది.

చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ లో తొలి ప్రొడక్షన్ గా రూపొందనున్న ఈ సినిమా అక్టోబర్ 15న రామానాయుడు
స్డూడియోస్ లో ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్స్ ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. దర్శకుడు శివశంకర్ దేవ్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

పోస్టర్ ను బట్టి ఇదొక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనిపిస్తోంది. సూట్ వేసుకున్న హీరో చేతిలో పిస్టల్ తో
టార్గెట్ ఎయిమ్ చేశారు. మరి ఆ టార్గెట్ ఏంటో, ఎందుకో తెలియాలంటే సినిమాలో చూడాలంటున్నారు
మేకర్స్.

ఆది సాయికుమార్ ఈమధ్య కొత్త తరహా చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. పాటలు, ఫైట్స్
లేపోయినా, కాన్సెప్ట్ బాగుంటే చాలంటున్నాడు. అలా ఆయన చేస్తున్న మరో కొత్త ప్రయత్నంగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు.