చైతూ-సమంత విడిపోవడమే మంచిది

హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీళ్ల విడాకులపై
స్పందించడానికి మాత్రం ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ ముందుకురాలేదు. దాన్ని వాళ్ల వ్యక్తిగత విషయంగా
కొట్టిపారేస్తున్నారు. ఒక దర్శకుడు మాత్రం ముందుకొచ్చాడు. చై-శామ్ విడాకులపై ఓపెన్ గా స్పందించాడు. అతడే దర్శకుడు దేవ కట్టా.

గతంలో నాగచైతన్య హీరోగా, సమంత హీరోయిన్ గా ఆటోనగర్ సూర్య అనే సినిమా తీశాడు దేవకట్టా. వాళ్లిద్దరితో వర్క్ చేసిన అనుభవం ఉండడంతో.. దేవ కట్టా స్టేట్ మెంట్ కు ప్రాధాన్యం పెరిగింది. ఇంతకీ ఇతడు చెప్పేదేంటంటే.. సమాజం కోసం మనసు చంపుకొని, కష్టపడి కలిసుండే కంటే.. విడిపోయి స్నేహితులుగా ఉండడం మంచిది అంటున్నాడు. ఆ విషయంలో సమంత-చైతూ మంచి నిర్ణయం తీసుకున్నారంటున్నాడు కట్టా.

వాళ్లిద్దరూ వ్యక్తిగతంగా తనకు తెలుసని, భార్యాభర్తలుగా కంటే విడిపోయి స్నేహితులుగా వాళ్లు మరింత
సంతోషంగా ఉంటారనే నమ్మకం తనకు ఉందంటున్నాడు దేవకట్టా. ఈ సందర్భంగా నాగచైతన్యపై
స్పందిస్తూ.. కుదిరితే చైతూతో ఓ లవ్ స్టోరీ తీయాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. దేవ కట్టా డైరక్ట్ చేసిన రిపబ్లిక్ సినిమా తాజాగా థియేటర్లలోకొచ్చిన సంగతి తెలిసిందే.