‘మా’ ఎన్నికలపై హీరో సిద్దార్థ్ రియాక్షన్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారం ఎంత వాడివేడిగా జరుగుతుందో అందరికీ తెలిసిందే. మంచు విష్ణు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తున్నానని అంటున్నాడు హీరో సిద్దార్థ్. తనకు కూడా సభ్యత్వం ఉందని ఈ సందర్భంగా ప్రకటించాడు.

“నేను ‘మా’లో లైఫ్ టైం మెంబర్‌ను. ఆహుతి ప్రసాద్ గారు ఉన్న సమయంలోనే మెంబ‌ర్‌షిప్ తీసుకున్నాను. ‘మా’ ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తున్నాను. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ కూడా ఫాలో అవుతున్నాను. నేను కచ్చితంగా అందరి మాటలు విని.. నా మనసులో ఏమనిపిస్తుందో.. వారికే ఓటు వేస్తాను.”

ఇలా “మా” ఎన్నికలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు సిద్దార్థ్. మహాసముద్రం సినిమా ప్రమోషన్ లో
భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ హీరో.. ప్రొడక్షన్ కంపెనీ పెట్టిన విషయాన్ని బయటపెట్టాడు.

“నేను బయటి నుంచి వచ్చాను. అలా బయటి నుంచి వచ్చిన వారి కోసం నేను ప్రొడక్షన్ కంపెనీ పెట్టాను. కొత్త వారిని ఎంకరేజ్ చేద్దామని అనుకున్నాను. తెలుగులో కూడా కొంత మంది యంగ్ దర్శకులతో సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాను.”

మహా సముద్రం సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని, అందులో తను హీరోనా లేక విలనా అనే
విషయాన్ని సినిమా చూసి తెలుసుకోవాలని ఊరిస్తున్నాడు.