హైవే పని పూర్తిచేసిన దేవరకొండ

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ హీరోగా ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్
ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్‌ థ్రిల్లర్ `హైవే`. మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది.
‘చుట్టాలబ్బాయి’ సినిమాతో నిర్మాతగా మారిన వెంకట్ తలారీ.. తన రెండో ప్రయత్నంగా నిర్మించిన సినిమా
ఇది.

క్యాచీ టైటిల్‌తో పాటు డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలంగాణ‌, ఆంధ్రప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క
రాష్ట్రాల్లోని అద్భుత‌మైన లొకేష‌న్స్‌లో షూట్ చేశారు. తాజాగా హైవే షూటింగ్ పూర్త‌య్యింది.

శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ బేనర్‌పై ఒక డిఫ‌రెంట్ క్రై మ్‌ థ్రిల్లర్‌ గా ‘హైవే’ మూవీ రూపొందుతోంది. 118 వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన గుహ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సినిమాతో కలుపుకొని ఆనంద్ దేవరకొండ ఒకేసారి రెండు సినిమాలు పూర్తి చేసినట్టయింది. ఇప్పటికే ఈ హీరో పుష్పకవిమానం అనే సినిమాను పూర్తిచేశాడు. ఇప్పుడు హైవే సినిమా కూడా రెడీ అయింది. వీటిలో పుష్పక విమానం సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే ప్రచారం సాగుతోంది.