మాస్ మహారాజ్ గా మారిన రాజ్ తరుణ్

స్టార్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ , సిమ్రత్, సంపద హీరోహీరోయిన్లుగా
సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వంలో కొత్త సినిమా లాంఛ్ అయింది. దీనికి మాస్ మహారాజ్ అనే టైటిల్
పెట్టారు. అసిఫ్ జానీ ఈ సినిమాకు నిర్మాత.

ఈ చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో
జరిగింది. కార్యక్రమానికి నిర్మాత సి.కళ్యాణ్, జెమిని కిరణ్, దర్శకుడు వీరశంకర్, నిర్మాత బెక్కం వేణుగోపాల్, నాంది డైరెక్టర్ సతీష్ కనకమేడల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తొలి ముహూర్తపు సన్ని వేశానికి హీరో, హీరోయిన్ లపై దర్శకుడు వీరశంకర్ క్లాప్ నివ్వగా, జెమిని కిరణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత సి.కళ్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు.

మనకు సూర్యచంద్రులు ఒకరి కోసం ఒకరు ఎలా వస్తూ వెళ్తున్నారో ఈ సినిమాలో వీరిద్దరూ ఒకరి కోసం, ఒకరు ఏం త్యాగం చేశారన్నదే కథ. ఫ్రెండ్షిప్ కోసం తీస్తున్న ఈ సినిమాను ఫ్రెండ్స్ ఎవరు చూసినా మా ఇద్దరి జీవితాల్లో ఇటువంటి కథ జరిగిందని అనుకునేలా ఈ సినిమా ఉంటుందంటున్నారు మేకర్స్.