ప్రేమలో పడిన రకుల్ ప్రీత్ సింగ్

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో పడింది. ఆ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో తను ప్రేమలో ఉన్నట్టు రకుల్ ప్రకటించింది. ఈరోజు రకుల్ తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెకు ఐ లవ్ యూ చెప్పాడు జాకీ. దానికి ప్రతిస్పందిస్తూ రకుల్ కూడా అతడికి ఐ లవ్ యూ చెప్పింది. దీంతో వీళ్లిద్దరి మేటర్ బాహ్య ప్రపంచానికి తెలిసొచ్చింది.

సాధారణంగా ఇలాంటి ఎఫైర్లు దాగవు. ఎక్కడో ఒక చోటు, ఏదో ఒక సందర్భంలో దొరికిపోతారు. కానీ రకుల్-జాకీ మాత్రం తమ రిలేషన్ షిప్ ను బయటకు పొక్కనీయకుండా చాలా జాగ్రత్త పడ్డారు. దాదాపు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఈరోజు ఆ విషయాన్ని బయటకు చెప్పేవరకు మీడియాకు తెలియకపోవడం విశేషం. ఒక దశలో రాశిఖన్నా, జాక్వెలిన్ ఫెర్నాండెడ్ లాంటి తారలు కూడా ఈ మేటర్ తెలిసి ఆశ్చర్యపోయారంటే.. వీళ్లిద్దరూ ఎంత సీక్రెట్ గా ప్రేమించుకున్నారో ఆర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా స్టార్స్ పెళ్లిపై ఓ అభిప్రాయానికి వచ్చిన తర్వాతే ప్రేమ విషయాన్ని బయటపెడతారు.
మొన్నటికిమొన్న కాజల్ కూడా అదే పని చేసింది. సో.. రకుల్ కూడా త్వరలోనే తన పెళ్లి మేటర్ కూడా
బయటపెట్టే అవకాశం ఉంది. ఈ రోజు ఆమె 31వ ఏట అడుగుపెట్టింది.