స్పీడ్ పెంచిన సమంత

జీవితంలోని చేదు జ్ఞాపకాల్ని మరిచిపోవాలంటే పనిలో పడిపోవాల్సిందే. లైఫ్ ను బిజీగా మార్చుకోవాల్సిందే. ఇప్పుడు సమంత అదే పని చేస్తోంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత స్పీడ్ పెంచింది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయబోతోంది. ఆల్రెడీ 2 సినిమాలు ఎనౌన్స్ చేసింది. త్వరలోనే మరో 2 ప్రకటించబోతోంది.

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించింది సమంత. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమాకు ఇద్దరు యువకులు హరి–హరీష్‌ దర్శకత్వం
వహించనున్నారు.

ఈ మూవీతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై మరో సినిమా ప్రకటించింది సమంత. శంతరుబన్
జ్ఞానశేఖరన్ అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా చేయబోతోంది. ఇది కూడా తెలుగు-తమిళ
భాషల్లోనే రాబోతోంది.

ఈ రెండు సినిమాలు ఫిమేల్ ఓరియంటెడ్ కథలే. పైగా ఈ రెండు సినిమాలు వచ్చే నెల నుంచి ప్రారంభం
కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కాకుండా.. ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ ను ప్రకటించే ఆలోచనలో కూడా ఉంది సమంత.