తెలుగు వెబ్ సిరీస్ లో త్రిష

ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లకు టాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. తన ప్రతిభతో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. అవినాష్ కొల్ల ఇప్పుడు తన సోదరుడు అశోక్ కొల్లతో కలిసి కొత్త ప్రొడక్షన్ కంపెనీ పెట్టాడు. దీనికి “అండ్ స్టోరీస్” (&Stories) అనే పేరు పెట్టారు.

సోనీ లివ్ ఓటీటీ ఫ్లాట్ ఫాంతో కలిసి తమ మొదటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు అవినాష్. త్రిష హీరోయిన్‌గా
బృందా అనే టైటిల్‌తో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతోన్నారు. త్రిష కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సరైన కథ కోసం వేచి చూస్తోంది. ఇన్నాళ్లకు సరైన స్క్రిప్ట్ దొరకడంతో ఇలా ఓటీటీ బాట పట్టేసింది. తాజాగా ఈ సిరీస్ పూజా కార్యక్రమాలతో మొదలైంది.

సోనీ లివ్ మొట్టమొదటిసారిగా ఓ తెలుగు వెబ్ సిరీస్‌ చేస్తోంది. అది కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో
రాబోతోన్న అద్భుతమైన కథతో రాబోతోంది. సూర్య వంగల ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం
అవుతున్నాడు. ఫిదా ఫేమ్ శక్తికాంత్ కార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నాడు.