బ్యాచిలర్ బ్రేక్ ఈవెన్ అయ్యాడు

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. అయితే ఇక్కడ కాదు. ఓవర్సీస్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్సీస్ లో 200కు పైగా స్క్రీన్స్ లో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు 3 లక్షల 72వేల డాలర్లు ఆర్జించింది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. త్వరలోనే ఇది హాఫ్ మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ కాబోతోంది.

దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమా 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ… వసూళ్లు మాత్రం స్టడీగా ఉన్నాయి. మొదటి రోజు 5 కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా రెండో రోజు 4 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించింది. అంటే సినిమా ఆక్యుపెన్సీ పెద్దగా తగ్గలేదని అర్థం.

అయితే ఓవైపు వసూళ్లు స్టడీగా ఉన్నప్పటికీ అఖిల్ ఆశించిన సక్సెస్ మాత్రం ఈ సినిమాతో రాలేదనే చెప్పాలి. కెరీర్ లో ఇప్పటివరకు క్లీన్ హిట్ కొట్టలేకపోయాడు అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ఆ కోరిక తీరుతుందని అనుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా అఖిల్ ను నిరాశపరిచింది.