ముచ్చటగా మూడోసారి కలిశారు

నిఖిల్, సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో మరో సినిమా రాబోతోంది. ఈసారి వీళ్లిద్దరూ కలిసి భారీ యాక్ష‌న్ మూవీ ప్లాన్ చేశారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న 32వ
చిత్ర‌మిది. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత.

ఇంతకుముందు నిఖిల్-సుధీర్ వర్మ కాంబినేషన్ లో స్వామిరారా అనే సినిమా వచ్చింది. అది పెద్ద
హిట్టయింది. ఆ తర్వాత కేశవ అనే సినిమా చేశారు. అది కూడా హిట్టయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కలిసింది ఈ జోడీ.

అక్టోబ‌ర్ 25 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. తొలి షెడ్యూల్‌ను 40 రోజుల పాటు లండ‌న్‌లో చిత్రీక‌రించ‌నున్నారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు కార్తీక్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారు. తాజా సమాచారం ప్రకారం రీతూవర్మను ఇందులో హీరోయిన్ గా అనుకుంటున్నారు.