మళ్లీ ఆహా అనిపించబోతున్న సమంత

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కెరీర్ పరంగా సమంత బిజీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె
ఇప్పటికే 2 సినిమాలు ఎనౌన్స్ చేసింది. త్వరలోనే ఓ బాలీవుడ్ మూవీ కూడా ప్రకటించే ఆలోచనలో ఉంది. ఇప్పుడు వీటికి తోడు మరోసారి ఆహా ఓటీటీ వేదికపై సమంత కనిపించనుంది.

సమంతకు, ఆహాకు మధ్య ఉన్న సంబంధం మనకు తెలుసు. ఆహా ఓటీటీ కోసం యాంకర్ గా మారిపోయింది సమంత. ఎంతోమంది సెలబ్రిటీల్ని ఇంటర్వ్యూ చేసింది. చిరంజీవి, రానా, రకుల్ ఇలా చాలామందిని ఇంటర్వ్యూ చేసింది. ఆ సిరీస్ లో ఆఖరి ఎపిసోడ్ కింద తన మాజీ భర్త నాగచైతన్యను కూడా ఇంటర్వ్యూ చేసింది.

ఇప్పుడు మరోసారి ఆహాలో కనిపించబోతోంది సమంత. అయితే ఈసారి ఆమె ఇంటర్వ్యూలు చేయడం లేదు. ఆహాలో ఓ వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో ఉంది. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయి.

కెరీర్ లో తొలిసారి ఫ్యామిలిమేన్-2 రూపంలో ఓ వెబ్ సిరీస్ చేసింది సమంత. ఇప్పుడు ఆహాలో తన రెండో వెబ్ సిరీస్ చేయబోతోంది. ఇలా మరోసారి సమంత కెరీర్ పరంగా బిజీ అయింది.