దుబాయ్ లో ఖిలాడీ హంగామా

రవితేజ, రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రయూనిట్ దుబాయ్‌లో ఉంది. రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలపై అంద‌మైన‌
పాటను చిత్రీకరించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వ‌ర‌ప‌రిచిన ట్యూన్‌కు యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రఫీ
చేస్తున్నాడు. దుబాయ్‌తో పాటు మస్కట్‌లోని కొన్ని ప్రదేశాల్లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు.

రవితేజ, డింపుల్ హయతి న‌టించిన‌ ఇష్టం అనే పాటను వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆ మెలోడీ ట్యూన్ అందరినీ ఆకట్టుకుంది. థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేసేందుకు దర్శకుడు రమేష్ వర్మ అద్భుత‌మైన క‌థ‌ను రెడీ చేశాడు.

సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్
స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంతో
అల‌రించ‌నున్నారు.