ఎఫ్3 మూవీ కొత్త విడుదల తేదీ ఇదే!

విక్ట‌రీ వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో 2019
సంక్రాంతి విన్న‌ర్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద‌ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం ‘ఎఫ్ 2’. వరుస విజయాలతో
దూసుకెళ్తోన్న బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఔట్ అండ్ ఔట్
ఎంట‌ర్‌టైన‌ర్‌గా భారీ వ‌సూళ్ల‌ను సాధించిన ‘ఎఫ్‌2 ’చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ రూపొందుతోన్న సంగతి
తెలిసిందే.

దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ ఎంటర్‌టైనర్‌కు ఫ్రాంచైజీగా వస్తోన్న సినిమా కావడంతో సినిమాపై
మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడీ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఎఫ్3 సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

నిజానికి ఈ సినిమాను ఆగస్ట్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. సెకెండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో వాయిదా పడింది. ఆ తర్వాత సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమాలు బరిలో ఉండడంతో, సంక్రాంతి నుంచి కూడా తప్పుకుంది. ఫైనల్ గా ఫిబ్రవరి 25న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు.