రంగమార్తాండ కోసం చిరంజీవి

మెగా కాంపౌండ్ కు దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో దర్శకుడు కృష్ణవంశీ ఒకరు. చిరంజీవికి కృష్ణవంశీకి మంచి
అనుబంధం ఉంది. గతంలో వీళ్లిద్దరూ కలిసి వందేమాతరం అనే సినిమా చేయాలనుకున్నారు. కానీ అది
కార్యరూపం దాల్చలేదు. ఇన్నేళ్లకు చిరంజీవి-కృష్ణవంశీ కలిశారు.

కృష్ణవంశీ తీస్తున్న రంగమార్తాండ సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పారు చిరంజీవి. ఈ విషయాన్ని కృష్ణవంశీ
స్వయంగా బయటపెట్టారు. చిరు వాయిస్ ఓవర్ తో రంగమార్తాండ రేంజ్ ఇంకాస్త పెరిగింది. అడగ్గానే, తన
గొంతుని అరువు ఇచ్చినందుకు మెగాస్టార్ కి కృతజ్ఞతలు తెలిపారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ.

రంగమార్తాండ మొదలై చాలా రోజులైంది. మధ్యలో కరోనా రావడంతో సినిమా లేట్ అవుతూ వస్తోంది.
ఎట్టకేలకు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోకి ఎంటరైంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ఓ
సినిమాకు రీమేక్ ఇది.

బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ నటిస్తున్న ఈ
సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.