ఆ క్రేజీ కాంబినేషన్ కలిసింది

హీరోల్లో పవన్ కల్యాణ్ రేంజ్ అందరికీ తెలిసిందే. ఇక హీరోయిన్లలో పూజా హెగ్డేది కూడా దాదాపు అదే రేంజ్. మరి ఇప్పుడీ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? ఆ రోజు రానే వచ్చింది. పవన్ కల్యాణ్ సరసన తొలిసారి నటించబోతోంది పూజా హెగ్డే. వీళ్లిద్దర్నీ కలిపిన ఆ దర్శకుడు హరీష్ శంకర్.

త్వరలోనే పవన్ కల్యాణ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు హరీశ్ శంకర్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రా బోతున్న ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డేను తీసుకోవాలనుకుంటున్నాడు హరీశ్ శంకర్.

హరీష్ కు పూజా హెగ్డే సెంటిమెంట్ అయిపోయింది. తన కెరీర్ కు అత్యంత కీలకమైన దువ్వాడ జగన్నాధమ్ టైమ్ లో పూజాను తీసుకున్నాడు హరీష్. ఆ తర్వాత గద్దలకొండ గణేశ్ కోసం కూడా పూజాను రిపీట్ చేశాడు. ఇప్పుడు సెంటిమెంట్ గా పవన్ కోసం కూడా పూజాహెగ్డే ను లాక్ చేశాడు ఈ దర్శకుడు. ఈ సినిమా కోసం 2 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటోందట పూజాహెగ్డే.