దేవరకొండ ఖాతాలో 30 మంది అమ్మాయిలు

పుష్పక విమానం అనే సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన
సినిమా ఇది. ఈ మూవీ కోసం డిఫరెంట్ గా ప్రమోషన్ ప్లాన్ చేశాడు ఆనంద్. తన అన్న విజయ్ దేవరకొండతో కలిసి చిట్ చాట్ పెట్టాడు. ఈ ఇంటర్వ్యూలో అన్నకు సంబంధించి కొన్ని సీక్రెట్స్ బయటపెట్టాడు. అందులో ఒకటి గర్ల్ ఫ్రెండ్స్ ఎలిమెంట్.

విజయ్ దేవరకొండకు సినిమాల్లోకి రాకముందు 30-40 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట. ఎప్పటికప్పుడు
అమ్మాయిల్ని మార్చడం విజయ్ దేవరకొండకు వెన్నతో పెట్టిన విద్య అంటున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇదే విషయాన్ని పరోక్షంగా విజయ్ దేవరకొండ కూడా ఒప్పుకున్నాడు. డేటింగ్ విషయానికొస్తే.. ఆనంద్ ఒక అమ్మాయికే ఫిక్స్ అవ్వగలడని, తను మాత్రం డేటింగ్ పై గట్టిగా నిలబడలేనన్నాడు. తన దృష్టి కెరీర్ పై ఉంటుందని, అమ్మాయిలపై ఉండదని అన్నాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న ఈ
సినిమా కోసం కొత్తగా ముస్తాబయ్యాడు విజయ్.