తన పోస్టర్లు తానే అంటించుకున్న హీరో

అయితే ఓ సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. కొందరు భారీ ఏర్పాట్లతో పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తుంటారు, ఇంకొందరు స్టార్ హీరోలతో టైటిల్, టీజర్ లాంచ్ లాంటివి చేస్తుంటారు. తాజాగా అదే బాటలో తమ సినిమా ప్రమోషన్ కోసం గతంలో ఎన్నడూలేని విధంగా వినూత్నమైన ప్లాన్ చేశారు “రామ్ అసుర్” హీరో అభినవ్ సర్దార్, హీరోయిన్ చాందిని.

ఎలాంటి హంగు, ఆర్భాటాలకు పోకుండా స్వయంగా జనంలోకి వెళ్లి తమ సినిమా చూడండి, మంచి కంటెంట్ ఉన్న మూవీ అని వాళ్ళు చెప్పారు. బస్టాండ్ లాంటి పబ్లిక్ ఏరియాల్లో తిరుగుతూ రామ్ అసుర్ మూవీ గురించి వివరించారు. అంతేకాదు వాల్ పోస్టర్స్ కూడా స్వయంగా ఆ ఇద్దరే అంటించి ప్రమోషన్స్‌లో డిఫరెంట్ స్ట్రాటజీ చూపించారు.

వెంక‌టేష్ త్రిప‌ర్ణ దర్శకత్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న “పీనట్ డైమండ్” చిత్రం మాస్ ఆడియన్స్‌కు రీచ్ కావాలని ఈ చిత్ర టైటిల్‌ను `రామ్ అసుర్`గా మార్చడమైనది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా నవంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్ లీడ్ రోల్స్ పోషించారు. `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చాడు.