అమ్మ తెలుగు.. నాన్న బెంగాలీ

లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్లలోకి వస్తున్నాడు నాని. అతడు నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. అంతకంటే ముందు నాని నటించిన V, టక్ జగదీశ్ సినిమాలు ఓటీటీలో నేరుగా రిలీజయ్యాయి. దీంతో శ్యామ్ సింగరాయ్ థియేట్రికల్ రిలీజ్ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు నాని. ఏకంగా టీజర్ రిలీజ్ కే ప్రెస్ మీట్ పెట్టి మరీ హంగామా చేశాడు. సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ను మీడియాతో పంచుకున్నాడు. అందులో కొన్ని హైలెట్స్ ను బ్యాక్ టు బ్యాక్ చూద్దాం.

– రెండేళ్ల తరువాత థియేటర్‌కు వస్తున్నామంటే ఈ మాత్రం ఉండాలి కదా?.. కరెక్ట్ సినిమాతో వస్తున్నాను. క్రిస్మస్ మాత్రం మనదే.

– క్రిస్మస్ అనేది నాకు స్పెషల్. ఎంసీఏ సినిమాతో వచ్చాను. ఆ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది. పైగా సినిమా చాలా బాగా వచ్చింది.

– ఇది ప్రేమ కథ. ఎపిక్ లవ్ స్టోరీ. శ్యామ్ అమ్మ తెలుగు. నాన్న బెంగాలి. కథ విన్నప్పుడు నాకు ఓ హై వచ్చింది. ఇలా కనుక సినిమా తీస్తే బాగుంటుందని అనుకున్నాం. కాని అంతకంటే బాగా వచ్చింది.

– సాయి పల్లవితో ఇదివరకే ఎంసీఏతో హిట్ వచ్చింది. ఇప్పుడు డిసెంబర్ 24న ఏం జరగబోతోందో కూడా నాకు తెలుసు. హిట్ కాంబినేషన్‌గా మేం చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.