చిరంజీవి సరసన మరోసారి ఛాన్స్

మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా భారీగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే ప‌వ‌ర్‌ఫుల్‌ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతోన్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతోన్నారు.

నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ముఖ్య ప్రకటన చేశారు. గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార కీలక పాత్రలో నటిస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. సైరా చిత్రంతో చిరంజీవి నయనతార అందరినీ మెప్పించారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు.

మెగాస్టార్ సినిమా అంటే అభిమానులకు ఎలాంటి అంచనాలుంటాయో తెలిసిన దర్శకుడిగా మోహన్ రాజా.. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు తగినన్ని మార్పులు చేర్పులు చేశారు. తమిళ్ లో పెద్ద హిట్టయిన మాస్టర్ సినిమాకు పనిచేసిన నీరవ్ షా కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక తమన్ అద్భుత‌మైన‌ సంగీతాన్ని అందించేందుకు సిద్దమయ్యారు. సురేష్ సెల్వరాఘవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే నయనతార సెట్స్ పైకి రానుంది.