మా సినిమా అద్భుతం అంటున్న హీరో

ఓ బేబి, జాంబిరెడ్డి వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన యంగ్‌ హీరో తేజ సజ్జా. ఇప్పుడీ హీరో తన మూడో సినిమా రెడీ చేశాడు. దాని పేరు అద్భుతం. హీరో రాజశేఖర్‌ కూతురు శివాని రాజశేఖర్‌ హీరోయిన్‌గా రామ్‌మల్లిక్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు రామ్ మల్లిక్ దర్శకుడు. టైటిల్ కు తగ్గట్టు ఈ సినిమా నిజంగా అద్భుతం చేస్తుందంటున్నాడు తేజ.

“ప్రేక్షకుల ఊహలను, అంచలనాలను తలక్రిందులు చేస్తూ ఎక్కువ ట్విస్ట్‌లు, టర్నింగ్‌లు ఉన్న ఎంగేజింగ్‌ కథ ఇది. ఎప్పుడూ కథకే నా ప్రాధాన్యం. సినిమా కంటెంట్‌ బాగుంటే, ఎంత లో-ప్రొఫైల్‌లో ఉన్నా రిలీజ్‌ దగ్గరకు వచ్చేసరికి చక్కటి పబ్లిసిటీతో ప్రేక్షకులను చేరే ఛాన్స్‌ ఉంటుంది అనేది నా అభిప్రాయం. నాకు ఆడియెన్స్‌కు ఎప్పుడూ ఒక ఇంట్రస్ట్‌ క్రియేట్‌ చేయాలనే ఆలోచన ఉంటుంది. అందుకు కొత్త కొత్త జోనర్‌లను ఎంచుకోవటం ఒక బెస్ట్‌ రూట్‌. అలా ఆడియెన్స్‌ను కట్టి పడేసే ఒక సరికొత్త జోనర్‌ ప్రేమకథ ఈ ‘అద్భుతం’. ట్రైలర్‌ చూసిన ప్రేక్షకుల అంచనాలకు మరెన్నో వండర్స్‌ యాడ్‌ చేసే సినిమా ఇది”

అంతా బాగుంది కానీ ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వడం లేదు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా రిలీజ్ అవుతోంది. రథన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. రేపే ఈ సినిమా స్ట్రీమింగ్ కు వస్తోంది.