మరోసారి సమర్థించుకున్న వెంకీ

డైరక్ట్ ఓటీటీ రిలీజ్ పై మరోసారి స్పందించాడు వెంకటేశ్. గతంలో అతడు నటించిన నారప్ప సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఆ టైమ్ లో అభిమానులకు సారీ కూడా చెప్పాడు వెంకీ. ఇప్పుడు మరోసారి డైరక్ట్ ఓటీటీలోకి వస్తున్నాడు. ఈసారి దృశ్యం-2ను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాడు. అయితే ఈసారి మాత్రం సారీ చెప్పలేదు. సమర్థించుకున్నాడు.

“సినిమాలు తీశామా? రిలీజ్ చేశామా? అంతే.. ఎంజాయ్ చేసే వాళ్లు ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. మనం ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి. ఇలాంటి చిత్రాలు ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఎంత మంది చూస్తారు అని కాదు కానీ..ఈ బడ్జెట్‌కు ఓటీటీ బెస్ట్ అని నిర్మాతలు అనుకున్నారేమో.”

ఇలా తన సినిమాను సమర్థించుకున్నాడు వెంకీ. తన ఫ్యాన్స్ హర్ట్ అవుతారనే విషయం తనకు తెలుసని, కానీ ఓపిగ్గా ఉండాలని, నెక్ట్స్ సినిమా థియేటర్లలోనే వస్తుందంటున్నాడు వెంకీ. అతడు నటిస్తున్న ఎఫ్3 సినిమా థియేటర్లలోనే విడుదలకానుంది.