కృతి శెట్టితో లేడీ ఓరియంటెడ్ మూవీ

ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది కృతి షెట్టి మాత్రమే. ఉప్పెన సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ, వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు మరో సినిమాకు ఓకే చెప్పింది. అయితే ఈసారి కృతి ఓకే చేసిన సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీ కావడం విశేషం.

అవును.. కెరీర్ లో తొలిసారి ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ చేయబోతోంది కృతి శెట్టి. అది కూడా మెగా కాంపౌండ్ లో. చిరంజీవి కూతురు సుశ్మిత, నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. జీ గ్రూప్ తో కలిసి ఆమె వెబ్ మూవీస్, సిరీస్ చేస్తోంది. ఇందులో భాగంగా ఆమె వద్దకు ఓ మంచి లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ వచ్చింది..

ఈ సినిమాను కృతి షెట్టితో నిర్మించాలని సుశ్మిత ఫిక్స్ అయింది. అటు జీ తెలుగు ఛానెల్ కు కృతి షెట్టి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సో.. వెంటనే ప్రాజెక్టు లాక్ అయిపోయింది. ప్రస్తుతం హీరో కోసం అన్వేషిస్తున్నారు. ప్రాజెక్టు సెట్ అయిన తర్వాత దర్శకుడి డీటెయిల్స్ బయటపెడతారు.

ప్రస్తుతం కృతి షెట్టి సుధీర్ బాబు, రామ్, నాగచైతన్య సినిమాలతో బిజీగా ఉంది. వీటిలో ఏదో ఒకటి కంప్లీట్ అయితే, ఆ వెంటనే సుశ్మిత బ్యానర్ పై కొత్త సినిమా స్టార్ట్ చేస్తుంది ఈ బ్యూటీ.