జీ తెలుగు చేతికి చరణ్-శంకర్ సినిమా

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అప్పుడే ఈ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ మొదలైంది. జీ స్టూడియోస్ రంగంలోకి దిగింది. ఈ ప్రాజెక్టులోకి సహ-నిర్మాతగా ఎంటరైంది జీ స్టూడియెస్ సంస్థ. అంటే.. దిల్ రాజుతో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట.

దాదాపు ఏడాదిగా జోరు చూపిస్తోంది జీ గ్రూప్. వరుసగా సినిమాల్ని దక్కించుకుంటోంది. ఇందులో భాగంగా వకీల్ సాబ్, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, ఎఫ్3 లాంటి సినిమాల రైట్స్ దక్కించుకోగా.. ఇప్పుడు చరణ్-శంకర్ సినిమా కూడా జీ చేతికి వెళ్లింది. కేవలం శాటిలైట్, డిజిటల్ రైట్స్ మాత్రమే కొనకుండా, కొన్ని సినిమాల నిర్మాణంలో కూడా భాగస్వామిగా మారుతోంది. ప్రస్తుతం సెట్స్ పైకి ఉన్న బంగార్రాజు ప్రాజెక్టు కూడా జీ గ్రూప్ దే.

ఇక చరణ్-శంకర్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూణెలో పూర్తయింది. రామ్ చరణ్, కియరా అద్వానీపై ఓ భారీ సాంగ్ పిక్చరైజ్ చేశారు. ఇక సెకెండ్ షెడ్యూల్ 5 రోజుల కిందట రామోజీ ఫిలింసిటీలో మొదలైంది. ఈ షెడ్యూల్ లో చరణ్ పై ఓ భారీ ఫైట్ తీస్తున్నారు. ఏకంగా ఓ రైల్వే ట్రాక్ సెట్ కూడా వేశారు. ఇదే షెడ్యూల్ లో మరో పాట కూడా పూర్తిచేయబోతున్నారు.