శ్రియ సినిమాకు తేదీ ఫిక్స్ అయింది

శ్రియ నటించిన గమనం సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాతో సుజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. పాన్ ఇండియన్ స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. శ్రియా, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు.

గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు తాజాగా ప్రకటించారు. అయితే ఇది పాన్-ఇండియా సినిమానే అయినప్పటికీ.. డిసెంబర్ 10న కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే విడుదల కానుంది. మంచి తేదీలు చూసి మిగతా భాషల్లో సినిమాను విడుదల చేస్తారు.

గమనంలో మూడు భిన్న కథలను ఒకే సినిమాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో శ్రియా సరన్ ఓ కథలో అలరించనున్నారు. శివ కందుకూరి ప్రేమకథలో కనిపించనున్నారు. అనాథలు, స్లమ్ ఏరియా నేపథ్యంలో జరిగే కథలో ప్రియాంక జవాల్కర్ నటించారు. సాయి మాధవ్ బుర్రా అద్భుతమైన సంభాషణలు అందించగా.. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. జ్ఞానశేఖర్ వి.ఎస్ కెమెరామెన్‌గా వ్యవహరించారు.