పేరు మారకుండా వస్తున్న మరక్కార్

మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన భారీ చిత్రం మరక్కార్. అరేబియా సముద్ర సింహ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం డిసెంబర్ 2ను విడుదల కానుంది. ప్రియదర్శన్ తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌ మళయాంలో భారీ ఎత్తున నిర్మించారు.

మరక్కార్ తెలుగు హక్కులను టాలీవుడ్ నెంబర్ వన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్ దక్కించుకుంది. తెలుగులో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. రీసెంట్ గా వచ్చిన రజనీకాంత్ పెద్దన్న సినిమాను కూడా ఇదే సంస్థ తెలుగులో రిలీజ్ చేసింది.

మోహన్ లాల్‌కు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన హీరోగా వచ్చిన మన్యం పులి సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది. జనతా గ్యారెజ్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.

అర్జున్, సునీల్ శెట్టి, కిచ్చా సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేష్, కళ్యాణి ప్రయదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఓ మలయాళ సినిమా డబ్బింగ్ వెర్షన్, అదే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అవ్వడం విశేషం.