ఎక్స్ క్లూజివ్.. అనసూయ కొత్త సినిమా డీటెయిల్స్

టీవీ కార్యక్రమాలకు సంబంధించి అనసూయ ఏం చేస్తుందనేది అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా సూపర్ హిట్ జబర్దస్త్ లో ఆమెను చూసేందుకు చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే టీవీ షోస్ తో పాటు ఆమె సినిమాలు కూడా చేస్తుంది. ఈ విషయంలో అనసూయ చాలా క్లియర్ గా ఉంది. సినిమాల వరకు కేవలం నటించడానికి అవకాశం ఉండే పాత్రల్ని మాత్రమే ఆమె చేయడానికి ఆసక్తి చూపిస్తోంది.

ఇందులో భాగంగా సైలెంట్ గా మరో సినిమా స్టార్ట్ చేసింది అనసూయ. నిన్నట్నుంచి ఆమె సెట్స్ పైకి వచ్చింది. ఆ సినిమాకు సంబంధించి ప్రీ-లుక్ ను కూడా ఆమె నిన్న రిలీజ్ చేసింది. ఇప్పుడా సినిమాకు సంబంధించి ఎక్స్ క్లూజివ్ డీటెయిల్స్ ఇక్కడ అందిస్తున్నాం.

జయశంకర్ దర్శకత్వంలో అనసూయ నటిస్తోంది. గతంలో పేపర్ బాయ్, విటమిన్-షి లాంటి కాన్సెప్ట్ హిట్ మూవీస్ ను అందించాడు జయశంకర్. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం ఓ ఆంథాలజీని సెలక్ట్ చేసుకున్నాడు. 6 కథల సమాహారంగా రాబోతున్న ఈ సినిమాలో అతుల్ కులకర్ణి, సాయికుమార్ లాంటి సీనియర్లు నటిస్తున్నారు. వీటిలో ఓ కథలో అనసూయ కనిపించబోతోంది. సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ ఆమె.

ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో అనసూయ ఎయిర్ హోస్టెస్ గా కనిపించబోతోంది. పైకి అది ఎయిర్ హోస్టెస్ పాత్ర అయినప్పటికీ.. అందులో చాలా డెప్త్ ఉంటుంది. ఆమె లుక్ కూడా చాలా కొత్తగా ఉండబోతోంది. ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకుంది అనసూయ. కచ్చితంగా తన సినీ కెరీర్ కు ఇది ప్లస్ అవుతుందని భావిస్తోంది. ప్రస్తుతం ఓ షెడ్యూల్ నడుస్తోంది. వచ్చే నెల మరో షెడ్యూల్ లో సినిమాను పూర్తిచేయబోతున్నారు.