అఖండలో ప్రగ్యా జైశ్వాల్ పాత్ర ఇదే

బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ లో రాబోతోంది అఖండ సినిమా. భారీ అంచనాలున్న ఈ సినిమాలో బాలయ్య రెండు ఢిపరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. వీటితో పాటు హీరోయిన్ రోల్ కూడా అత్యంత కీలకమైనదని చెబుతోంది యూనిట్. ఇన్నాళ్లకు ఆ పాత్ర ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. స్వయంగా హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ తన క్యారెక్టర్ ను రివీల్ చేసింది.

అఖండలో కలెక్టర్ పాత్రలో కనిపించబోతోంది ప్రగ్యా జైశ్వాల్. ఈ సినిమాలో కేవలం పాటల కోసం ఆమెను తీసుకోలేదు. ఆమెది బలమైన పాత్ర. ఇంకా చెప్పాలంటే, అఘోర పాత్రధారి అఖండ ఎంటరయ్యేది ప్రగ్యా జైశ్వాల్ కోసమే. ఈ కీలమైన పాయింట్ ను విడుదలకు 3 రోజుల ముందు బయటపెట్టేసింది ప్రగ్యా జైశ్వాల్.

తమన్ కంపోజ్ చేసిన ఈ సినిమా సాంగ్స్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రయిలర్ కూడా హిట్టయింది. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా గ్రాండ్ గా చేశారు. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.