రేపే అఖండ విడుదల

సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిసి చేస్తున్న సినిమా. అందుకే అఖండపై అన్ని అంచనాలు. ఈసారి ఇద్దరూ కలిసి హ్యాట్రిక్ కొట్టాలని నందమూరి ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. ఇలా భారీ అంచనాల మధ్య, మరెన్నో ప్రత్యేకతలతో రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది అఖండ మూవీ.

ఈ సినిమాలో బాలయ్య ఎప్పట్లానే రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి అఘోర పాత్ర. సినిమా మొత్తానికి ఈ పాత్రే హైలెట్ అంటున్నారంతా. మరీ ముఖ్యంగా హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ను కాపాడే సన్నివేశంలో ఈ పాత్ర వస్తుందంటూ బలంగా ఓ ప్రచారం సాగుతోంది.

తమన్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతం అందించాడు. పాటలు ఇప్పటికే హిట్టవ్వగా, ఆర్ఆర్ కూడా అదే రేంజ్ లో ఉంటుందనే టాక్ నడుస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించాడు. బాలయ్య నటవిశ్వరూపం చూపించిన అఖండ సినిమా రిజల్ట్ ఏంటనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.