మొదటి రోజు మెరిసిన అఖండ

బాలయ్య సినిమాలకు ఓపెనింగ్స్ తగ్గి చాలా రోజులైంది. కాకపోతే ఈసారి బోయపాటితో కలిశాడు ఈ సీనియర్ హీరో. ఇద్దరూ కలిసి గతంలో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తీశారు కాబట్టి.. ఈసారి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అవును.. అఖండ సినిమా మొదటి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది.

మొదటి రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ 23 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇన్నాళ్లు డల్ గా ఉన్న థియేటర్లు ఆఖండతో 88శాతం ఆక్యుపెన్సీకి చేరుకున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 45 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అటుఇటుగా మరో 32 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఆల్రెడీ ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరమైన ఈ సినిమా, అంత మొత్తాన్ని అందుకుంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏపీ, నైజాంలో ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 4.37 కోట్లు
సీడెడ్ – 3.28 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.35 కోట్లు
ఈస్ట్ – 1.05 కోట్లు
వెస్ట్ – 94 లక్షలు
గుంటూరు – కోటి 85 లక్షలు
కృష్ణా – 80 లక్షలు
నెల్లూరు – 93 లక్షలు