అఖండ 3 రోజుల వసూళ్లు

ఊహించని విధంగా అఖండ సినిమా బాక్సాఫీస్ బరిలో క్లిక్ అయింది. మొదటి రోజు ఈ సినిమాకు నెగెటివ్ కామెంట్స్, నెగెటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ సినిమా మాత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. మరీ ముఖ్యంగా బి, సి సెంటర్ ఆడియన్స్ కు నచ్చడంతో అఖండకు వసూళ్ల వర్షం కురుస్తోంది.

రిలీజైన ఈ 3 రోజుల్లో అఖండ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 28 కోట్ల 46 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నైజాంలో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ కు దగ్గరవ్వగా.. ఈస్ట్, వెస్ట్, కృష్ణాలో బ్రేక్ ఈవెన్ సాధించింది. అటు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ మార్క్ కు దగ్గరైంది.

వరల్డ్ వైడ్ ఈ సినిమా 53 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఇదే ఊపు కొనసాగితే, మరో 3 రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అఖండ సినిమాకు ఈ 3 రోజుల్లో వచ్చిన షేర్లు (ప్రాంతాల వారీగా) ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 9.13 కోట్లు
సీడెడ్ – రూ. 7 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.9 కోట్లు
ఈస్ట్ – రూ. 2.03 కోట్లు
వెస్ట్ – రూ. 1.62 కోట్లు
గుంటూరు – రూ. 2.70 కోట్లు
నెల్లూరు – రూ. 1.40 కోట్లు
కృష్ణా – రూ. 1.68 కోట్లు