మహేష్ బాబుకు కరోనా

హీరో మహేష్ బాబు కరోనా బారిన పడ్డాడు. తనకు కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చినట్టు స్వయంగా ఈ హీరో వెల్లడించాడు. మహేష్ బాబుకు కరోనా సోకడంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. ఇప్పటికే మంచు మనోజ్, మంచు మనోజ్ లాంటి వాళ్లకు కరోనా సోకగా.. ఇప్పుడు మహేష్ బాబు కూడా కరోనా బారిన పడడం కలకలం రేపుతోంది.

నిజానికి మహేష్ రెండేళ్లుగా చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. రెండో దశ కరోనా టైమ్ లో పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. అడుగు కూడా బయటపెట్టలేదు. పరిస్థితులన్నీ మెరుగైన తర్వాతే సర్కారువారి పాట షూటింగ్ స్టార్ట్ చేశాడు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మహేష్ ను కరోనా వదల్లేదు.

మహేష్ కు దుబాయ్ లో కరోనా సోకి ఉండొచ్చని చాలామంది అభిప్రాయపడుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లాడు మహేష్. రీసెంట్ గా హైదరాబాద్ తిరిగొచ్చాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు బయటపడింది. ప్రస్తుతం మహేష్ కు స్వల్పంగా కరోనా లక్షణాలున్నాయి.

తనతో ఈమధ్య కాలంలో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా పరీక్షలు చేయించుకోవాలని కోరాడు మహేష్. దర్శకుడు వంశీ పైడిపల్లి కుటుంబం మహేష్ తో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంది.