మరో హీరోయిన్ కు కరోనా

‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఇషా చావ్లా అందరికీ గుర్తుండే ఉంటుంది. నందమూరి బాలకృష్ణ సరసన ఆమె ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో కూడా నటించింది. అలాగే ‘పూలరంగడు’, ‘Mr పెళ్ళికొడుకు’, జంప్ జిలాని, విరాట్, రంభ ఊర్వశి మేనక, వంటి అనేక చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి ఇషా చావ్లా ప్రస్తుతం కబీర్ లాల్ దర్శకత్వంలో 6 బాషల్లో వస్తున్న “దివ్య దృష్టి” సినిమాలో మెయిన్ లీడ్ గా నటిస్తుంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ చేస్తున్న సినిమాలకు బ్రేక్ పడింది. ఇషా చావ్లా కరోనా బారిన పడింది. తనకు కరోనా సోకినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఈ భామ. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఇషా చావ్లా అందరూ కూడా డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ తగిన జాగ్రత్తలు పాటించి సేఫ్ గా ఉండాలని సూచించింది. అలాగే త్వరలో కరోనా నుండి బయటపడి షూటింగ్స్ లో పాల్గొంటానని తెలియజేసింది.

టాలీవుడ్ లో వరుసగా నటీనటులు కరోనా బారిన పడుతున్నారు. మొన్న వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడగా.. తాజాగా సీనియర్ నటి శోభనకు వైరస్ సోకింది. హీరోయిన్ త్రిష కూడా వైరస్ బారిన పడింది. ఇప్పుడు ఇషా చావ్లా కూడా ఈ లిస్ట్ లోకి చేరింది.