కృతి శెట్టి ‘తెలుగు’ పలుకులు

బంగార్రాజు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఇంటర్వ్యూల్లో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న హీరోయిన్ కృతి శెట్టి. దీనికి కారణం ఆమె తెలుగు. అవును.. కృతి శెట్టి తన రెండో సినిమాకే అద్భుతంగా తెలుగు మాట్లాడుతోంది. దీనిపై ఆమె స్పందించింది.

“నేను షూటింగ్‌లోనే తెలుగు నేర్చుకున్నా. ఉప్పెన టైంలోనే కొద్దిగా తెలుసు. ఆ త‌ర్వాత తెలుగు సినిమాలు చూడ‌డం రెగ్యుల‌ర్‌గా నా టీమ్‌తో తెలుగులోనే మాట్లాడ‌డం జ‌రిగింది. చాలామంది తెలుగులో డ‌బ్బింగ్ చెప్ప‌మ‌న్నారు. కానీ నాకింతా పూర్తి కాన్ఫిడెన్స్ రాలేదు. ఎందుకంటే నా గొంతు నాకు అంత‌గా న‌చ్చ‌దు. ముందుముందు అంద‌రికీ న‌చ్చితే త‌ప్ప‌కుండా డ‌బ్బింగ్ చెబుతాను.”

ఇలా తన తెలుగు భాష పాండిత్యాన్ని చూపించింది కృతిశెట్టి. బంగార్రాజు సినిమాపై స్పందించిన ఈ బెంగళూరు భామ.. రెండేళ్ల కిందటే సోగ్గాడే చిన్ని నాయనా సినిమా చూశానంటోంది.

“సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాను 2020లోనే చూశాను. అందుకే బంగార్రాజు సినిమా చేసేట‌ప్పుడు ఒత్తిడి అనిపించ‌లేదు. ఆ సినిమాలో కామెడీ టైమింగ్ నాకు బాగా న‌చ్చింది. నాకు తెలుగు రాక‌పోయినా సినిమాకు క‌నెక్ట్ అయ్యాను. అందులో నాగ్ సార్‌తో పాటు ఇత‌ర పాత్ర‌లు బాగా ఎంజాయ్ చేశాను.”

ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వస్తోంది బంగార్రాజు సినిమా. తాజాగా ట్రయిలర్ కూడా రిలీజైంది. టీజర్ ఎంత హిట్టయిందో, ట్రయిలర్ కూడా అంతే బాగుంది.