హీరోగా మారనున్న స్టార్ సింగర్

ప్రస్తుతం మ్యూజిక్ వరల్డ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సిద్ శ్రీరామ్. అన్ని భాషల్లో పాటలు పాడుతూ మ్యూజిక్ లవర్స్ కి ఫేవరేట్ సింగర్ గా మారాడు సిద్. తక్కువ టైంలోనే మోస్ట్ పాపులర్ సింగర్ అనిపించుకున్నాడు. సిద్ తో ఒక పాట పాడిస్తే చాలు సినిమా పై బజ్ క్రియేట్ అవుతుందనే క్రేజ్ తో దూసుకెళ్తున్నాడు సిద్.

అయితే సిద్ శ్రీరామ్ క్రేజ్ చూసి త్వరలోనే అతన్ని హీరోగా పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారట మణిరత్నం. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘కడలి’ సినిమాతోనే సిద్ సింగర్ గా పరిచయం అయ్యాడు. అక్కడి నుండి వెనక్కి చూసుకోకుండా సింగర్ గా సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేస్తున్నాడు. ఇప్పుడు సిద్ శ్రీరామ్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యత ను కూడా మణిరత్నం తీసుకున్నారని కోలీవుడ్ ఇన్ సైడ్ న్యూస్.

ప్రస్తుతానికి ప్రాజెక్ట్ అయితే సెట్ అవుతుంది కానీ మణిరత్నం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారా ? లేదా ఆయన నిర్మాణంలో సినిమా రాబోతుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే సిద్ శ్రీరామ్ హీరోగా మారబోతున్నడనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి అభిమానుల్ని ఎగ్జయిట్ చేస్తోంది.