ముద్దు సీన్ పై స్పందించిన దిల్ రాజు

దిల్ రాజు సినిమాలకు ఓ మార్క్ ఉంటుంది. అతడి బ్రాండ్ ఏంటనేది ఆడియన్స్ కు బాగా తెలుసు. మరీ ముఖ్యంగా దిల్ రాజు సినిమాల్లో శృంగారం, లిప్ కిస్సుల్లాంటివి ఉండవు. కానీ రౌడీ బాయ్స్ సినిమాలో మాత్రం లిప్ కిస్ ఉంది. హీరో ఆశిష్ ను హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గట్టిగా లిప్ కిస్ చేస్తుంది.

ఫస్ట్ టైమ్ తను తీసిన సినిమాలో లిప్ కిస్ ఉందని క్లారిటీ ఇచ్చాడు నిర్మాత దిల్ రాజు. ఆ కిస్ సీన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చాడు. జనరేషన్ కు తగ్గట్టు అప్ డేట్ అవ్వాలంటున్నాడు ఈ ప్రొడ్యూసర్.

“కొన్నిసార్లు నా బ్రాండ్ దాటి సినిమాలు చేయాలి. రౌడీ బాయ్స్ కంప్లీట్ గా యూత్ సినిమా. ఇప్పటిదాకా నా సినిమాల్లో ముద్దు సీన్స్ ఉండవు. కానీ ఫస్ట్ టైమ్ ఈ చిత్రంలో కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అందుకే ట్రైలర్ లోనే ముద్దు సీన్ రివీల్ చేశాం. రేపు ఫ్యామిలీ ఆడియెన్స్ మా సినిమాకు వచ్చి ఇబ్బందిపడొద్దనే అలా ట్రైలర్ లో కిస్ సీన్ పెట్టాం. కాలేజ్ కు వెళ్లే స్టూడెంట్ ఎలా ఉంటాడో ఆశిష్ క్యారెక్టర్ అలా ఉంటుంది. అతని లైఫ్ లో కొన్ని ఇబ్బందులు అధిగమించి ఎలా ఎదిగాడో ఆసక్తికరంగా ఉంటుంది.”

ఇలా లిప్ కిస్ సన్నివేశంపై క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు. రేపు థియేటర్లలోకి వస్తోంది రౌడీ బాయ్స్. దిల్ రాజు తమ్ముడు శిరీష్ తనయుడు ఆశిష్, ఈ సినిమాతో హీరోగా పరిచయమౌతున్నాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.