వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా సంగతులు

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రాబోతోంది. ఈరోజు వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ లు ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వైష్ణవ్ తేజ్ కు ఇదే తొలి మూవీ.

తొలి చిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాల్లో బలమైన ముద్రవేసిన వైష్ణవ్ తేజ్.. ఈ కొత్త సినిమాలో సరికొత్త మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమా బడ్జెట్ కూడా ఎక్కువే. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై వరుసపెట్టి సినిమాలు తెరకెక్కుతున్నాయి. ధనుష్ హీరోగా సార్ అనే సినిమా షూట్ స్టార్ట్ అయింది. నవీన్ పొలిశెట్టి హీరోగా కొత్త సినిమా ఎనౌన్స్ అయింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లూ విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ సినిమా ప్రకటన కూడా వచ్చేసింది.